టిడ్కో ఇల్లు, జగనన్న ఇల్లు సందర్శించిన సత్తెనపల్లి జనసేన

ఉమ్మడి గుంటూరు జిల్లా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్లను, టిడ్కో ఇళ్లను సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల పరిస్థితిపై, #FailureOfJaganannaColony డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లిలోని టిడ్కో ఇల్లు, జగనన్న ఇల్లు, సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, తెలుసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ఇల్లు అనేది నాయకుల జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని, ఇల్లు లేని పేదవాడి కల, కలగానే మిగిలిపోయిందని, కనీస మౌళిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారని, వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇప్పటికైనా సకాలంలో పేదలకు ఇల్లు అందించి వారి కలను సాకారం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, దమ్మలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, నకరికల్లు ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాస్ రావు, రాజుపాలెం మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచులు అనేష్, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.