పశ్చిమ నియోజకవర్గంలో గెలుపే దిశగా పనిచేస్తాం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఒక బీసీ నేత నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మొదట సమీక్ష సమావేశాలు నిర్వహించి గెలుపుకు కావలసిన వ్యూహాలు వేస్తామన్నా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లకు గాను 15 డివిజన్లో కమిటీలను పూర్తి చేశాం మిగిలిన 7 డివిజన్లలో కూడా తొందర్లోనే కమిటీలు పూర్తిచేసి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోయే సమీక్షా సమావేశానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం. నియోజకవర్గంలో బలాబలాలను మరియు లోటుపాట్లను సరిదిద్దుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై డివిజన్ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో చర్చించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతాం. పశ్చిమ నియోజకవర్గంలో గెలుపే దిశగా కష్టించి సమిష్టిగా పనిచేస్తాం. నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రజలకు సాక్ష్యాధారాలతో తెలియజేశాం అనేక అక్రమాలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని అర్హులైన పేదలకు పథకాలు అందించడంలో వైఫల్యం చెందారని నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యే గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిఎం జగన్ వైఎస్ఆర్సిపి పాలనలో సంక్షేమ పథకాలు అందక, అభివృద్ధి లేక, పన్నుల భారం మోయలేక ఈ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనేక ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలకి అండగా నిలబడుతూ ఇసుక విధానంపైన, రాజధాని అమరావతిపై, కౌలు రైతుల కోసం, గోతులుపడ్డ రోడ్ల కోసం, నిరుద్యోగ యువత కోసం, విశాఖ ఉక్కు కోసం మరియు అనేక ప్రజా సమస్యలపై నిత్యం బలంగా పోరాడుతున్నందున జనసేన పార్టీని ప్రజలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా భావిస్తున్నారని విజయవాడ జనసేన పార్టీ నగర అద్యక్షులు పోతిన మహేష్ అన్నారు.