పాలకొండలో రెండవ రోజు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పాలకొండ, జనసేన అధినేత పవన్ కళ్యణ్ పిలుపుమేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శనివారం తంపటాపల్లిలో రోడ్లు దయనీయ పరిస్థితిలో ఉండడం వల్ల స్కూల్ పిల్లలు అవస్థలు పడుతున్నారు. #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో పాలకొండ నియోజవర్గంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు పరిస్థితికి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.