పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీరాజశ్యామల యాగం రెండవ రోజు

సత్తెనపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తలపెట్టిన శ్రీరాజశ్యామలయాగం రెండవ రోజుకు చేరిందని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. ఈ యాగాన్ని నకరికల్లు మండలం చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని, అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీశతకుండాత్మక మహారుద్ర, శతసహస్ర మహాచండీసహిత శ్రీరాజశ్యామల యాగం సోమవారం మొదలుపెట్టారు.మంగళవారం రాజశ్యామల యాగంలో భాగంగా గురు ప్రార్థన, గోపూజ, మందప పూజలు, చండి పారాయణం, రాజశ్యామల జపం, రుద్రాభిశేకం, రాజశ్యామల యోగం, రుద్ర హోమం, హారతి, మంత్ర పుష్పం, చతుర్వేద స్వస్తి జరిపించారు. యాగం ఈనెల 9న పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ యాగంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ యాగానికి గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా రామాంజనేయులు, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్ద కొలిమి కిరణ్ కుమార్, కేసనపల్లి కృష్ణబాబు, కారంపూడి మండల అధ్యక్షులు కొండ, సైధా, కోటేశ్వరరావుతో పాటుగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు.