జనసేనలో చేరిన శీలం వెంకటరమణ

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం, సర్పవరం గ్రామం భావన్నారాయణపాడు ప్రాంత బీసీ సామజిక వర్గానికి చెందిన పెద్దలు శీలం వెంకటరమణ మరియు వారి అనుచరులు, పెద్దలు, మహిళలు భావన్నారాయణపాడులో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.