గరికిపాటి వెంకట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ లందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాస్టర్లు ప్రార్థన చేసి గరికపాటి వెంకట్ ని ఆశీర్వదించారు. తర్వాత సెమీ క్రిస్మస్ సందర్భంగా చిరు కానుకలు అందజేశారు.