ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా విధ్యార్ది నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున బోరబండలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన సిద్ధాంతాలను, విలువలను అలవరచుకొని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు.