జనసేన ఆధ్వర్యంలో దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు

  • కుల వివక్ష లేని సమసమాజ స్థాపనే పవన్ కళ్యాణ్ ధ్యేయం
  • మనుషులందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం
  • కుల మత వర్గ బేధాలు మనుషులు సృష్టించుకున్నవే
  • పల్నాటి బ్రహ్మనాయుడు, బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో దళిత వాడల్లో జనసేన సహపంక్తి భోజనాలు

గుంటూరు: కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయ వ్యవస్థే పునాదిగా ఏర్పడ్డ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, కుల వివక్ష లేని సమసమాజ స్థాపనే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ సానుభూతి పరుడు పురాణం కుమార స్వామి నేతృత్వంలో స్థానిక 25 వ డివిజన్ లోని నేతాజీ నగర్, పట్టంశెట్టి వెంకటేశ్వరరావు కాలనీలో జరిగిన సహపంక్తి భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అధ్యక్షత వహించారు. నేరేళ్ళ సురేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనుషులందరిలో ప్రవహించేది ఒకే రక్తమని, కుల మత వర్గ భేదాలు మనుషులు సృష్టించుకున్నవేనన్నారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని కులమతాల పేరుతో దశాబ్దాలుగా రాజకీయ నాయకులు ప్రజల్ని దగా చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ నేతలు తాము చేసే అవినీతిని, అరాచకాలను, దోపిడీలను ప్రజలు ప్రశ్నించకుండా సమాజంలో కుల వివక్ష పేరుతో ప్రజల మధ్య చిచ్చు రగిల్చి రాజకీయ చలి కాచుకుంటున్నారని నెరేళ్ల సురేష్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం ఉండరాదని, ప్రజలందరూ సమానమేనన్న పల్నాటి బ్రహ్మనాయుడు, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ల స్పూర్తితో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రజలకు జనసేన పార్టీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వటం శుభపరిణామమని, ఇదే విధంగా ప్రతీ చోటా నిర్వహించాలన్నారు. ప్రజలందరూ తరతమ భేదాలు విడిచి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారో అప్పుడే ఒక మంచి సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన దిశగా జనసేన పయనిస్తోందన్నారు. మనుషులందరూ సమానమేనని, ఎవరూ ఎక్కువా కాదు ఎవరూ తక్కువ కాదని అందుకే తమ అధినేత పవన్ కళ్యాణ్ తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించాడన్నారు. కుల రక్కసిని అంతమొందించేందుకు, ప్రజల్లో ఉన్న అవగాహనారాహిత్యాన్ని పారద్రోలేందుకు సంఘ సంస్కర్తలు, మేధావులు ముందుకురావాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, లక్ష్మీ దుర్గ, జిల్లా కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, దళిత విభాగ నేతలు కొండూరి కిషోర్, బందెల నవీన్, కొనిదేటి కిషోర్, నాయకులు యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, చింతా రాజు, కోలా అంజి, గోపి, వీర మహిళలు రాజనాల నాగలక్ష్మి, కవిత, ఆషా, అనసూయ, బండారు రవీంద్ర, పుల్లంసెట్టి ఉదయ్, సయ్యద్ షర్ఫుద్దీన్, దొంత నరేష్, మిరియాల వెంకట్, సోమి ఉదయ్, యాట్ల దుర్గ ప్రసాద్, బాషా, కే.రవి, చెన్నం శ్రీకాంత్, రామిశెట్టి శ్రీనివాస్, కోనేటి ప్రసాద్, శేషు, చిరంజీవి, గిడుతూరి సత్యం, వడ్డె సుబ్బారావు, లక్ష్మిశెట్టి నాని, శెట్టి శ్రీను, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.