వైఎస్ జగన్ పై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా జగన్ గురించి షర్మిల మాట్లాడారు. ‘జగన్ గురించి మాట్లాడండి.. ఆయనతో విభేదాలున్నాయా..’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘జగన్ మోహన్‌రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. తెలంగాణలో నా పని నేను చూసుకుంటాను. తెలంగాణ వైసీపీ విభాగంతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది. త్వరలో పాదయాత్ర ఉండొచ్చు.

పార్టీ విషయంలో జగన్‌ అన్నతో నేను సంప్రదించలేదు. పార్టీ ఏర్పాటు అనేది సాహసోపేత నిర్ణయం. మా మధ్య అన్నాచెల్లెళ్ల బంధం కొనసాగుతుంది. రాజకీయంగా నా దారి నాదే.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రజల్లోకి వెళ్తాను. తెలంగాణ అంశాలకు మాత్రమే పరిమితం అవుతాను’ అని షర్మిల చెప్పుకొచ్చారు. మరోవైపు షర్మిల అభిమానులు, కార్యకర్తలు మాట్లాడుతూ ‘మాకు షర్మిళ – జగన్ రెండు కళ్ల లాంటి వాళ్ళు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాల్సి అవసరం ఉందని..

షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సహకరిస్తామని స్పష్టం చేశారు. విజయ విహార్ నుంచి విజయాన్ని మొదలు పెట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు.. షర్మిలకు సూచించారు. మీరు (షర్మిల) ఏం ఆదేశించినా తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.