రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన షేక్ సుభాని

ఉదయగిరి, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేపడుతున్న ఉపవాసం దీక్షలు చాలా గొప్ప విషయమని వింజమూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని అన్నారు. శుక్రవారం నుండి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కాబడిన సందర్బంగా అయన ముస్లిం మైనారిటీ వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం చేస్తున్న వారికి అల్లా ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయని ఆశించారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్బవించిన ఈ మాసంలో నెల రోజుల పాటు నియమనిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లా కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ దైవ చింతనతో గడిపే ఈ మాసంలో తమ తమ సంపాదనలో కొంత భాగాన్ని 30 రోజుల పాటు పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తున్న ముస్లిం సోదరులు అభినందనీయులని షేక్ సుభాని కొనియాడారు. మనిషిలోని చెడు భావాల్ని అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని అయన అన్నారు.