దర్శిలో పలుచోట్ల ఘనంగా చిరంజీవి జన్మదిన సంబరాలు

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు డా.పద్మ భూష్ణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన సందర్భంగా పలుచోట్ల కేకును కట్ చేసి అభిమానులలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణంలో గల శివాలయం వీధిలో నూగుల కోటేశ్వరరావు ఇంటి వద్ద మెగా అభిమానుల మరియు జనసైనికుల సమక్షంలో కేక్ ను కట్ చేసి అభిమానులతో పంచుకోవడం జరిగింది. అనంతరం దర్శి పట్టణంలోని ఎల్.పి రోడ్డు వద్ద నీలిశెట్టి ప్రభు, పాశం వెంకటేష్ ల ఆధ్వర్యంలో మరియు సందు వారి పాలెంలో సందు కోటి ఇంటి వద్ద ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలోని బీసీ కాలనీలో తోట లోకేష్ ఇంటి వద్ద మెగా అభిమానులు మరియు జనసైనికుల సమక్షంలో కేక్ ను కట్ చేసి ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు.