అమెరికా నైట్‌ క్లబ్బులో కాల్పులు.. ఒకరి మృతి

డల్లాస్‌: తుపాకీ మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. నైట్‌క్లబ్‌లో తలెత్తిన చిన్న వాగ్వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు మఅతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. డల్లాస్‌లోని ప్రైమ్‌ నైట్‌ క్లబ్బులో రెండు బఅందాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మరో బృందంలోని వ్యక్తి తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మఅతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుండి పరారైనట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.