వైభవోపేతంగా శ్రీరాముని శోభా యాత్ర

  • శ్రీరాముల వారి శోభా యాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ దంపతులు
  • సీతానగరం మండలంలో కన్నులపండుగగా శోభా యాత్రను ప్రారంభించిన బత్తుల దంపతులు

అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైన వేళ.. వందల ఏళ్ల హిందువుల నిరీక్షణ ఫలించిన మంచి రోజు రానే వచ్చేసింది. అయోధ్య రామయ్యను కనులరా చూసే భాగ్యం దక్కడం మనందరి అదృష్టం
హిందువుల స్వప్నం నెరవేరుతున్న ఘట్టం.. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సీతానగరం మండలంలో నిర్వహించిన శ్రీరాముల వారి శోభా యాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, మహిళా సాధికార కమిటీ కో ఆర్థినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, యువజన నాయకులు తోట పవన్ కుమార్ ప్రారంభించి పలు రామలయాల్లో సందర్శించి శ్రీరామ్ శోభా యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.