జనసేన-టిడిపి-బిజెపి ముఖ్య నాయకుల సమావేశం

కళ్యాణదుర్గం, జనసేన-టిడిపి-బిజెపి పార్టీల పొత్తులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ మరియు కళ్యాణదుర్గం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలో టిడిపి క్యాంప్ ఆఫీస్ ప్రజావేదిక వద్ద మొట్టమొదటిసారిగా జనసేన-టిడిపి-బిజెపి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన-టిడిపి-బిజెపి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారితో పాటు జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, పట్టణ అధ్యక్షులు, 5 మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.