ఘనంగా డా. గంగులయ్య జన్మదిన వేడుకలు

  • మౌలిక సదుపాయాల కల్పనలో వైసీపీ దారుణ వైఫల్యం

పాడేరు నియోజకవర్గం: ఈ ప్రశ్నలకు జవాబేదీ అంటూ పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య అధ్యక్షతన పలు గిరిజన సమస్యలకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, గిరిజన ప్రజలకు కల్పించాల్సిన అనేకరకమైన మౌలిక సదుపాయాల విషయంలో దారుణంగా వైఫల్యం చెందిందని అందుకు ఎస్టీ కార్పోరేషన్ నిధులు దారి మళ్లించి పంచాయితీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కూడా ఒక కారణమని అన్నారు. ఈ సందర్బంగా పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి భారీగా జనసేన పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. ఘనంగా జనసేన పార్టీ శ్రేణుల మధ్య జరిగిన అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.గంగులయ్య జన్మదిన వేడుకలు అరకు, పాడేరు నియోజకవర్గాల జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.