పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగరాయకొండ జనసేన

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ కి గురయ్యారని, అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగాఅవ్వాలని మరల తిరిగి మామూలుగా ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ, ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ వారి సతీమణి ల ఆధ్వర్యంలో సింగరాయకొండ నుండి బిట్రగుంట పోవు నేషనల్ హైవే పక్కనే వెలసి ఉన్న స్వయంభు కాలభైరవ స్వామి గుడిలో గురువారం నాడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో పర్యటనలో భాగంగా మర్గ మధ్యంలో పవన్ కళ్యాణ్ ఈ స్వయంభు కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్ వారి సతీమణి, జరుగుమల్లి మండల అధ్యక్షులు శశి భూషణ్, వీరమహిళ రజిని, మండల నాయకులు, కాసుల శ్రీనివాస్, అనుములశెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సంకే నాగరాజు, పొనుగోటి అశోక్, శీలం సాయి, పోలిశెట్టి విజయకుమార్, షేక్ మా బాషా, షేక్ సుల్తాన్ భాషా, వాయిల చిన్న, తగరం రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.