అవినీతికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన సింగరాయకొండ..!

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో గెలిచిందని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో మొదటి స్థానంలోనే అవినీతికి మారుపేరుగా ప్రసిద్ధిగాంచిన సింగరాయకొండ మేజర్ గ్రామ పంచాయతీ..! సింగరాయకొండ గ్రామపంచాయతీకి గ్రీన్ అంబాసిడర్ గా పేరు పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఇవేనా అంటున్న సింగరాయకొండ గ్రామప్రజలు, సంవత్సరానికి నాలుగు సార్లు కూడా చల్లని బ్లీచింగ్, ఎక్కడ వ్యర్ధాలు అక్కడే, ఎటు చూసినా పగలు కొట్టిన సీసీ రోడ్లు, ఎవరి ఇష్టారాజ్యంగా వారే ఎటువంటి అనుమతులు పొందకుండా సిసి రోడ్లు పగలగొట్టడం, వీటిని చూసి పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ బాబు. జియో 5జి అండర్ కేబుల్ వర్క్స్ సంబంధించి ముడుపులు అందుకున్నటువంటి కార్యదర్శి, ఎటు చూసినా అధ్వానంగా ఉన్న పారిశుధ్యం ఇవేనా గ్రీన్ అంబాసిడర్ కావాల్సిన అర్హతలు అని అంటున్న సింగరాయకొండ గ్రామప్రజలు పారిశుధ్యంను చూసి అవాక్కు అవుతున్న ప్రజలు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి గ్రీన్ అంబాసిడర్ గా కావాల్సిన అర్హతలను సింగరాయకొండ గ్రామపంచాయతీకి ఉన్నాయా లేవా అని చూసి మాత్రమే నిర్ధారించాలని అలాగే సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి ఫోన్లో అప్లోడ్ చేసి పెట్టేటటువంటి వాటిని చూసి మోసపోకుండా ప్రభుత్వాన్ని మోసం చేసేటువంటి కార్యదర్శిని శరత్ బాబు ని విధుల నుండి, ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించి, కార్యదర్శికి సహకరించినటువంటి సిబ్బందిని కూడా విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, సింగరాయకొండ గ్రామప్రజలు అందరూ కలిసి సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఆందోళన కార్యక్రమం చేయుటకు కూడా వెనకాడబోమని జిల్లా కలెక్టర్ కి మరియు అధికారులు అందరికీ కూడా తెలియజేయడమైనది.