సిరిమానోత్సవమా.. ? వైఎస్ఆర్సీపీ ఉత్సవమా..?

  • విశాఖపట్నంలో జరుగు జనవాణికి తరలిరండి
  • జనసేన నాయకులు ఆదాడ మోహనరావు
    🔸 చారిత్రక భవనాలకు, పురవీధుల్లో.. వైఎస్ఆర్సీపీ విద్యుత్ రంగులు తలపించే వెలుతుర్లా..?
    🔸 ప్రజలకు బురదనీరు ఇస్తూ మీరు ఉత్సవాలు జరుపుకుంటారా?
    🔸 జిల్లా అధికారులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు సూటి ప్రశ్న

విజయనగరం, అమ్మవారి పండుగ, విజయనగరం ఉత్సవాల పేరిట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు మేలుచేసిందేమీ లేదని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణములో పలు ప్రధానమైన కూడళ్ళు, చారిత్రక కట్టడాలు అయిన కోట, గంటస్థంభం నకు, మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్లో పండుగ, ఉత్సవాల పేరిట వైఎ్సార్సీపీ రంగులతో విద్యుత్ కాంతులతో నింపారే తప్ప ప్రజల్లో ఆనందాన్ని నింపలేదని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు, ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మంచినీటికి బదులు, వర్షాలు పడుతున్న సమయంలో ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద వహించకుండా బురదనీరును ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజలకు మేలుచేయకుండా ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం దగ్గరలో ఉందని హెచ్చరించారు.

  • జనవాణి ను వినియోగించుకోండి

ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు మేలు చేసేందుకు అవసరమైన పరిష్కార దిశగా అడుగులు వేసే జనవాణి కార్యక్రమం ఈనెల 16వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పార్టీలకు అతీతంగా జరిగే జనవాణి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కృతం కాని సమస్యలపై ఆధారాలతో విజ్ఞప్తులు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇవ్వవచ్చని, వేదిక త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.