సీతానగరం మండల విస్తృత స్థాయి సమావేశం

  • సీతానగరం మండల నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వీరమహిళలు
  • సీతానగరం భారీ బైక్ ర్యాలీ
  • 300 మంది పురుషులు, 100 మంది వీరమహిళల జనసేన పార్టీ చేరిక.

రాజానగరం, సీతానగరం మండలంలో శనివారం రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సీతానగరం మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. పెద్దలు, వీర మహిళలు, యువ కిశోరాలు, పేద, మధ్యతరగతి, ఉన్నత వంటి వర్గాలను మరచి అంగరంగ వైభవంగా బత్తుల బలరామకృష్ణకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న జనసేన గెలుపు కానున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనబలం ఈ బైక్స్ తిరిగిన ప్రతి మలుపులోను కళ్లకు కట్టినట్లుగా కనబడిందని, వేల సంఖ్యలో యువత బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ర్యాలీ రుజువు చేసిందని, తండోపతండాలుగా తరలివచ్చిన జనంతో సీతానగరం మండలం దద్దరిల్లిందని, బత్తుల వారి బలం బలగం జనసేన ర్యాలీలో నేడు బహిర్గతం అయ్యిందని అన్నారు.

  • వీరమహిళలతో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం

ఇంటి పని చూసుకో ఆడవాళ్లకు రాజకీయాలు ఎందుకనేవారికి బత్తుల వారిచ్చిన భేషయిన సమాధానం. జనసేన నాయకులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సిద్ధాంతాలను మాటల్లో చెప్పడం కాదు
ఆచరణలో చేసి చూపుతామని మరొక్కసారి స్పష్టం చేశారు. శనివారం నేడు సీతానగరం మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని వందలమంది వీర మహిళల అభినందనలతో, ఆడపడుచుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా వారిచేతులతోనే ప్రారంభోత్సవం చేయించారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో విచ్చేసిన వీర మహిళలు, సీనియర్ జనసేన నాయకులు, యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎప్పుడేప్పుడా జనసేన గెలుపు అని ఎదురుచూపు లు నిండిన కళ్ళతో, అత్యంత ఉత్సాహంతో బత్తుల వారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వీర మహిళల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం అద్భుతం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.