మానవ సేవయే మాధవ సేవ: డాక్టర్ యుగంధర్ పొన్న

*చెంగయ్యకు మంచి వైద్య సేవలు అందిస్తాం

*జనసేన సేవకే గాని సంపాదనకు కాదు

*జనసేన ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న

కార్వేటినగరం మండలంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో ఈదువారి పల్లి ఏ.ఏ.డబ్ల్యూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెంగయ్యను గుర్తించడం జరిగిందని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయిస్తామని హామీ ఇవ్వగా.. ఇచ్చిన వాగ్దానం ప్రకారం చంగయ్యను ప్రస్తుతం తిరుపతిలో బోత్ హాస్పిటల్ నందు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. చంగయ్యకు మెరుగైన వైద్యం అందించి, క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చే విధంగా వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. మానవసేవయే మాధవసేవ అని, జనసేన పార్టీ ఎప్పుడూ.. ఎల్లప్పుడూ నిరుపేదల కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన సేవకే గాని సంపాదనకు కాదని ఉద్ఘాటించారు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయంగా పని చేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ప్రధాన కార్యదర్శి కంటి పులి నరసింహులు
ఉన్నారు.