ముక్క శ్రీనివాస్ తో కలిసి సుబ్రహ్మణ్య షష్టిలో పాల్గొన్న శివశంకర్

పిఠాపురం నియోజకవర్గం, తాటిపర్తి గ్రామం నందు సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవ సంబరాల్లో భాగంగా ఉత్తరాంధ్ర గోల్డ్ మాన్, సీనియర్ జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆదేశానుసారం డాక్టర్ అన్నయ్య శివశంకర్ పిఠాపురం నియోజకవర్గం జనసైనికుల బృందంతో కలిసి ముక్క శ్రీనివాస్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు, వీరమరెడ్డి అమర్, కీర్తి చంటి, విరమరెడ్డి గంగాధర్ ప్రసాద్, సామినేడి అప్పన్న, సాదా గణేష్, గొల్లపల్లి వీరబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.