నోరు జారే మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి: రాయపూడి వేణుగోపాల్ రావు

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, మంత్రులుగా ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోని హడావిడిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ తో మీడియా ముందుకు వచ్చి మంత్రులు రాంబాబు, అమరనాద్, సత్యనారాయణ, రాజా, పవన్ కళ్యాణ్ మీద సత్యదూత ఆరోపణలు చేశారు. గతంలో మీలాగా పవన్ కళ్యాణ్ గారి మీద విషయం కక్కి, కక్కీ ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు మాజీ మంత్రులు త్వరలో మీకు అదే పరిస్థితి వస్తుంది. నిన్న ప్రెస్ మీట్ లో దీన్ని సినిమాలు తీయగలను రాంబాబు అంటున్నాడు. తీసుకో నిన్ను వద్దు అన్నది ఎవరు తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు సినిమాలు తీసుకో, సీరియల్ తీసుకో, సుకన్యతో వీధి నాటకాలు వేసుకో మాకు అభ్యంతరం లేదు. డాన్సులు కూడా వేచుకోండి. దమ్ము, ధైర్యం గురించి మీరే చెప్పాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక మరణించిన కౌలు రైతులు ఎంత మంది? వారికి మీరు చెల్లించిన పరిహారం ఎంత శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మీ నాయకుడు నేను అధికారం వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానని మాటిచ్చాడు చేసేరా మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. గతంలో నీటిపారుదల శాఖలోనే మంత్రిగా చేసిన ఒక మహాను బావుడు “పర్సెంట అర పర్సెంట తొందర ఎందుకన్నా” అన్నాడు ఏమి ఏమి చేయలేక పోయాడు. చివరికి తన మంత్రి పదవి పీకేస్తేతే నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీలు కట్టుకున్నాడు. త్వరలో మీ అందరి పరిస్థితి కూడా అదే. తమరు మంత్రి పదవులు ఉండేది రెండు సంవత్సరాలు ఖచ్చితంగా లెక్క పెడితే సంవత్సరం కూడా లేదు. ఉన్న ఈ కొద్ది సమయాన్ని శాఖాపరంగా మీ బాధ్యతలను కచ్చితంగా నిర్వహించండి. సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చెయ్యండి.పోలవరం పూర్తి చేయండి. రాష్ట్రనికి క్రొత్త పరిశ్రమలు తీసుకురండి. రోడ్డులు అభివృద్ధి చేయండి. దేవాలయాలు అభివృద్ధి చేయండి. రైతులకు మేలు చేయండి. మంత్రివర్గ విస్తరణకు ముందుగానే తర్వాత గాని గతానికి భిన్నంగా ఏమీ జరగడం లేదు. మీలాంటి అల్పుల అరుపులను చూస్తుంటే గజరాజును చూసి ఊర కుక్కలు మొరుగుతున్నట్లు అనిపిస్తుంది. వైసిపి మంత్రులారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ మీద అసత్య ఆరోపణలు మానుకోండి. లేనియెడల రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు అనీ నోరు జారే మంత్రులకు హెచ్చిరిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు.