కరోనా నుండి బయటపడిన స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అక్టోబర్ 28న కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె కరోనా నుండి బయటపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ” తాజా కరోనా పరీక్షల్లో నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. నా కోసం ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ట్విట్ చేసారు.