సోషల్ యాక్టవిస్ట్ దూసర్లపూడి ధర్నాకి తలాటం సత్య సంఘీభావం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు సోషల్ యాక్టవిస్ట్ దూసర్లపూడి రమణరాజు చేస్తున్న ధర్నాకి సంఘీభావం జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలియచేసారు. ఈ సందర్భంగా సత్య దూసర్లపూడి రమణరాజుని కలిసి మాట్లాడుతూ ప్రజలకి తమ అసంతృప్తిని తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, మరి ఆ నిరసించేది ఎక్కడో ఉంటే దానికి ప్రయోజనం ఏంటనీ అందువల్ల ఆ ధర్నా ప్రదేశాన్ని కలక్టరేటు వద్దకు మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే కదా అధికారులకి జరుగుతున్న అన్యాయం తెలిసి చక్కదిద్దే అవకాశం కలిగేది అని ప్రశ్నించారు. ద్వారంపూడి చేతిలో రాజారెడ్డి రాజ్యాంగంలో ఇలానే జరుగుతుందనీ, సామాన్యుడి కోసం చేస్తున్న ఈ యుద్ధానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుని దూసర్లపూడి రమణరాజుకి తెలియచేసారు. ఇలాంటి న్యాయమైన డిమాండ్ ని నెరవేరుస్తూ ధర్నాస్థలిని మార్చవలసిందిగా అధికారులని డిమాండ్ చేసారు.