28వ డివిజన్లో సామాజిక న్యాయ చైతన్య యాత్ర

కాకినాడ సిటి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారి నేతృత్వంలో 28వ డివిజన్లో కాకినాడ జనసేన పార్టీ సిటి కార్యదర్శి కుచ్చర్లపాటి అర్జున్ రాజు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ చైతన్య యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేసారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలని ప్రజలను చైతన్య పరిచారు. ఈ ప్రాంతంలోని ప్రజలు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు ఎక్కువ ఉన్నారని, వీరి జీవన విధానం మోటారు ఫీల్డు తో అనుసంధానమై ఉంటుందని, ఎన్నో ఏండ్లుగా ప్రాచుర్యం చెందినదిగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు అనారోగ్య పరిసరాలతో రోగాల బారిన పడుతున్నారనీ, ఈ వై.సి.పి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. నోరు విప్పితే నవరత్నాలు అంటున్నారని, తీరా పేద ప్రజలు ఎవరిని కలిసిన వారికి ఉన్న పించన్, అమ్మవొడి వగైరా వగైరా రావడం లేదంటున్నారని, మరి రత్నాలు ఎవరి జేబులోకి వెళ్ళుతున్నాయో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు. తమ జనసేన పార్టీ తరపున ప్రజలని చైతన్యవంతులని చెయడానికే ఈ యాత్ర చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, ఓలేటి రాము, ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, యర్రంశెట్టి చలపతిరావు, జ్యూస్ అబ్బయి, పోలిశెట్టి రామారావు, వాసు, నాగేశ్వర రావు, పినిశెట్టి శ్రీనివాసు, సుంకర సురేష్, రమేష్, నాగేంద్ర, రమణ, స్వామి, పెద్దిరెడ్డి రాజేష్, జాడా రాజు, రాంబాబు, ఏసేబు, సుమంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.