జనసేనతోనే సామాజిక న్యాయం: గురాన అయ్యలు

విజయనగరం, జనసేనతోనే సామాజిక న్యాయం జరుగుతుందని జనసేన నాయకులు గురాన అయ్యలు పేర్కొన్నారు. ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గంలో సారిపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన సిద్దాంతాలను ప్రజలందరికీ వివరించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ నాయకత్వంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో జనసేన అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ప్రజలపై నమ్మకం లేకనే వైసీపీ ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎన్ని స్టిక్కర్లు వేసుకున్నా వైసీపీ పనై పోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత రాజకీయాల్లో మార్పు కోరుకుంటుందని, యువకులు ఏ విధమైన మార్పు కోరుకుంటున్నారో అది జనసేన పార్టీతోనే సాధ్యమని గురాన అయ్యలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆదాడ మోహన్ రావు, తుమ్మి అప్పలరాజు దొర, తుమ్మి లక్ష్మీ, నెల్లమర్ల మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అచ్చెన్న నాయుడు, పూసపాటి రేగ మండల పార్టీ అధ్యక్షుడు జలపారి శివ, డెంకాడ మండల పార్టీ అధ్యక్షరాలు పతివాడ కృష్ణవేణి, జనసైనికులు బి.రామారావు, పి.రాజారావు, బి.విజయ శంకర్, డి.శేఖర్, యు.సంతోష్, సుర్యప్రకాష్, కె.అప్పలరాజు, ఎ.వెంకటేష్, ఆర్.రమణ, పి.భానుజీ, ఎంటి రాజేష్, ఎమ్.పవన్ కుమార్, భార్గవ్, వంశీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.