పోలీరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

నిడదవోలు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా శనివారం నిడదవోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను నిడదవోలు పట్టణం మరియు కోరుపల్లి గ్రామాల్లో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన కాలనీలు వర్షాలు వస్తే ముంపుకు గురవుతున్నాయని, కనీస సౌకర్యాలు రోడ్లు, డ్రైనేజిలు, మంచినీరు సదుపాయాలు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంగా రమేష్, మేడా పూర్ణ, కారింకి వరప్రసాద్, రాజా, షబ్బీర్, బాలు, పవన్, శివసాయి, ఏడిద శ్రీనివాస్, కాసాని వెంకటేష్, కారింకి దుర్గాప్రసాద్, కొయ్యల సాయి, కొయ్యల శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు.