జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన జనసైనికులు

జగ్గంపేట, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ మరియు మండల జనసైనికుల ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం రాజపూడి పంచాయతీ పరిధిలోని రాజపూడి, కృష్ణాపురం, సీతారామ్ పురం మరియు వెంగయమ్మపురం గ్రామాలలో జగనన్న కాలనీలను శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు జగనన్నకాలనీ పేరుతో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలలో అక్రమాలు జరిగాయని ఇక్కడ రాజపూడి పంచాయితీ పరిధిలో వేసిన జగనన్న లేవుట్ గెయిల్ కంపెనీ ఆయిల్ పైప్ లైన్ ఆనుకొని ఏర్పాటు చేశారని అన్నారు. ఇక్కడ ఏ ప్రమాదం సంభవించినా మాకు ఏవిధమయిన సంబంధంలేదని గెయిల్ ఇండియా కంపెనీ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారన్నారు. అలాగే ఈ ఇళ్ల స్థలాలను ఆనుకొని హైటెన్షన్ విద్యుత్ టవర్ల లైన్ ఒక ప్రక్కన మరొక ప్రక్క పుష్కర కాలువ, ఎగువన ప్రక్కనే ఒక పెద్ద చెరువు, స్మశానం వున్నాయని రాబోయే రోజుల్లో ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవ్వరు బాధ్యులు అని నిలదీశారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఊరికి దూరంగా కనీస మౌళిక వసతులు లేని చోట ప్రమాదం పొంచిఉన్నచోట ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్, ఎంపిటీసి దొడ్డా శ్రీను, మండలఅధ్యక్షులు మరిసే రామకృష్ణ, యూత్ అధ్యక్షులు మొగిలి గంగాధర్, బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, ప్రధాన కార్యదర్శి సీదిరి శివదుర్గ, అడపా రాంబాబు, కోట సత్తిబాబు జనసైనికులు పాల్గొన్నారు.