పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే జనసైనికులు ధీటుగా స్పందిస్తారు: వినుత కోటా

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అసెంబ్లీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తూ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శుక్రవారం తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. మార్చ్ 14 న జనసేన ఆవిర్భావ సభలో జనసేన సత్తా చూసి వెన్నెముకలో వణుకు పుట్టి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో పర్యటించి లేకుంటే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వను అని నిర్దేశించినందున, ప్రజాదరణ కోల్పోయిన ఈ ఎమ్మెల్యే, సొంత పార్టీ నాయకుల దగ్గర విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలు ఈ 3 సంవత్సరాలలో ఏనాడూ మాట్లాడకుండా ఒక కమెడియన్ లాగా వ్యవహరించడం నియోజకవర్గ ప్రజలను అవమానించడం తప్ప దానివల్ల ప్రజలకు ఉపయోగంలేదు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు గురించి చర్చించకుండా వెకిలి చేస్టలతో వ్యవహరించడం ఆయన రాజకీయ పరిపక్వతకి నిదర్శనం. మీరు ఈ 3 సంవత్సరాలలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యం. రాబోయే రెండు సంవత్సరాలు అయినా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే కనీసం ఎమ్మెల్యే సీటు అయినా దక్కుతుందని తేయజేయడం జరుగుతుంది. దమ్ముంటే 3 సంవత్సరాలలో నియోజకవర్గంలో చేసిన అభివృధి పై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు అక్రమంగా ఈ 3 సంవత్సరాలలో సంపాదించిన, దోచుకున్న వాటిపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక్క సారి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ధీటుగా జనసైనికులు స్పందిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్యతో మండల అధ్యక్షులు కొప్పల గోపి, రేణిగుంట మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, నాయకులు త్యాగరాజుకి, భాగ్యలక్ష్మి, ఉమామహేశ్వరి, జ్యోతి, నితీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.