ముస్లిం మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు

కోనసీమ జిల్లా, అమలాపురం పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి తెలుగు దేశం ఎమ్ పి అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఇమామ్ మౌలానా హఫీజ్ ప్రత్యేక (దువా) ప్రార్థన లు జరిపి గంటి హరీష్ మాధుర్ కు దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి మైనార్టీసెల్ అధికార ప్రతినిధి ముకరం హుస్సేన్, జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఎండి బషీర్, జిల్లాటిడిపి మైనార్టీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజా అబ్బాస్, జనసేన నాయకుడు కరీముల్లా బాబా, తదితరులు పాల్గొన్నారు.