షీ ట్యాక్సీ పథకానికి విశేష స్పందన

మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు, అటు ఉద్యోగులు, విద్యార్థులు, టూరిస్టు మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘షీ ట్యాక్సీ’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. తొలిసారిగా హైదరాబాద్‌ జిల్లాలో శ్రీకారం చుట్టిన షీ ట్యాక్సీ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో సబ్సిడీపై ట్యాక్సీలను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. పదో తరగతి చదివి, 18 ఏండ్ల వయస్సు పైబడిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాగా, ఎంపికైన మహిళలకు 35శాతం సబ్సిడీ, 10శాతం మార్జిన్‌ మనీతో మొత్తం 45శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను అందించాలని నిర్ణయించింది. అదేవిధంగా నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్‌ క్యాబ్‌ డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు.

అందులో భాగంగా ఆసక్తి ఉన్న మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 215 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్‌రావు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడంతో రాజస్థాన్‌లోని అజ్మీర షరీఫ్‌ దర్గాలో చాదర్‌ను సమర్పిస్తున్న టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, హజ్‌ మాజీ చైర్మన్‌ మసిఉల్లాఖాన్‌ తదితరులు. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయించుకున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పాపారావును మర్యాదపూర్వకంగా కలిశారు.