యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం ఎస్ ఉప్పరపల్లె గ్రౌండ్ లో శుక్రవారంరాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ చివరి రోజున విజేతలు మొదటి బహుమతి భువన జట్టు రెండవ బహుమతి జక్కాజట్టు గెలుపొందగా వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ యువత విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, రాట్నాల రామయ్య, భారతాల ప్రశాంత్, కట్టా మల్లికార్జున, శివాజి, వినయ్, సుబ్బయ్, బాస్కర్, సురేష్, వంశీ, రవి, శంకరయ్య, ప్రతాప్, కుమార్, హరి, రవిశంకర్, రాజ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.