కీళ్ల వాతంతో బాధపడుతున్న వ్యక్తికి పదివేలు ఆర్ధిక సాయమందించిన శ్రీ గుంటూరు శంకర్

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామంలో ఆచంట పద్మావతి అనే 22 సంవత్సరాల అమ్మాయి కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయాన్ని కువైట్ లో ఉన్నటువంటి కడప రైల్వేకోడూరుకు చెందిన శ్రీ గుంటూరు శంకర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించి ఆదివారం అతని పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలు ఆ కుటుంబానికి జనసేన గల్ఫ్ కార్మికులు గ్రూపు సభ్యులు మునెయ్య, గంటా రామకృష్ణ, సూర్యారావు, గుబ్బలప్రసాద్, నాగ చందూల సహాయసహకారాలతో శ్రీ మండేల బాబి నాయుడు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మరియు గ్రామస్తులు అందరూ కూడా శ్రీ గుంటూరు శంకర్ అందించిన సహాయానికి, శ్రీ గుంటూరు శంకర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా శ్రీ గుంటూరు శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవదాసుపాలెం గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.