శ్రీ పెద్దింట్లమ్మ తల్లి జాతరలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, భోగాపురం గ్రామానికి చెందినటువంటి శ్రీ పెద్దింట్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా గుడి కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ శ్రీ పెద్దింట్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని రూపాయలు 5116/- విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థి కట్ట నానాజీ, వెన్నపు గోపి, వార్డు మెంబర్ అడపా శ్రీను, పాలింకి దత్త, పోతుల లచ్చిబాబు, పాలింకి కృష్ణ, బుర్రి సూరిబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్లా వీరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.