Srikakulam: ‘మార్పు’ జనసేనలోకి భారీగా చేరిన యువత

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన టీడీపీ వైఫల్యాలు జనం చూపు జనసేన వైపు తిప్పుతోంది. జనసేన పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్న భావన పెరిగిపోతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీలోకి నిత్యం కొనసాగుతున్న చేరికలే అందుకు నిదర్శనం. ఆదివారం శ్రీకాకుళం టౌన్ నుంచి వైసీపీ, టీడీపీల నుండి 150 మంది జనసేనలో చేరారు. శ్రీ పాండ్రంగి రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీ భావజాలం, శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై యువత పార్టీలోకి వచ్చారని ఈ సందర్భంగా శివశంకర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రాజకీయాల్లో దీన్ని కీలక మార్పుగా భావించాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం చేసేందుకు నిర్విరామంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ డాక్టర్స్ సెల్ చైర్మన్ శ్రీ బొడ్డేపల్లి రఘు, పార్టీ నాయకులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్, శ్రీకాకుళం జిల్లా నాయకులు శ్రీ పెడాడ రామ్మోహన్, శ్రీ దాసరి రాజు, శ్రీ కణితి కిరణ్, అనుబంధ విభాగాల నాయకులు శ్రీ రామకృష్ణ, శ్రీ నాగు హరి బెహరా, న్యాయ విభాగం నాయకులు శ్రీ పల్గునరావు,శ్రీ తిప్పన దుర్యోదన్ రెడ్డి, శ్రీ ఈశ్వరరావు, శ్రీ కంచరాన సాయి తదితరులు పాల్గొన్నారు.