శ్రీవారి ఆలయమా – వైసీపీ కార్యాలయమా..?

  • శ్రీవారి దర్శనం మంత్రులు, కంత్రులకేనా – సామాన్యులకు లేదా..?
  • టీటీడీ ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తాం – జనసేన హెచ్చరిక.

తిరుపతి, వైకాపా వీఐపీలకోసం తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైసిపి కార్యాలయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మార్చేశారని, జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో జనసేన నేతలు జిల్లా ఉపాధ్యక్షుడు మధు బాబు, రాజేష్ యాదవ్, బాబ్జి, డా. బాబు, రాజమోహన్, హేమకుమార్, శ్రీహరి తదితరులతో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ మంత్రి ఓ పశువులా వెంకన్న దర్శనానికి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మందతో గ్రూప్ ఫోటో తీసి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, దీని ప్రభావంతో ఇంకా వీఐపీల ఒత్తిడి తిరుమలపై పడుతుందని, మంత్రి స్థాయిలో ఉండి మీరు పదిమందికి చెప్పాలే తప్ప ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు అందకుండా టీటీడీ అధికారులు చేస్తున్న తీరును తప్పుబట్టారు.