డీఎస్సి పై క్లారిటీ ఇవ్వకుండా.. టెట్ దేనికోసం.. ఎవరిని మోసం చేయడానికి?

జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు ముఖ్య మంత్రి అయిన తర్వాత ఇప్పుడే గుర్తొచ్చిందా? ప్రతి ఏటా డిఎస్సి తీస్తామని నిరుద్యోగులను నమ్మబలికి ఓట్లయించుకొని మోసం చేశారు. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత టెట్ పెడుతున్నారు. అది కుడా వందో.. రూ.250 ఉండే పరీక్ష ఫీజు రూ.500 వరకు పెంచారు.

ఇప్పుడు ఏకంగా టెట్ ను వేరే రాష్ట్రల్లో నిర్వహిస్తారా? ఇది సరైన పద్దతేనా.

నిరుద్యోగుల వద్ద పరీక్ష రుసుము తీసుకోవడమే సరికాదు.

రూ.500ఫీజు వసూలు చేయడమే కాకుండా చెన్నై, బెంగుళూరు, వెళ్లి పరీక్ష రాయాలంటే వారికీ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని భరించగలరా?

ఏటా డీఎస్సి తీస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికి డీఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పకుండా ఈ టెట్ దేనికోసం నిర్వహిస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి?

30వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి వస్తుందని రేషన లైజేషన్ పేరుతో చాలా పాఠశాలలను మూసేస్తూ ఉన్న ఉపాధ్యాయులే సుమారుగా 12వేల మంది అదనంగా ఉన్నట్టు చూపు తున్నారు.

అదనంగా టీచర్స్ ఉండగా టెట్ పెట్టి ఎవరిని మోసం చేయాలని మీ ఆలోచన జగన్ రెడ్డి గారు టెట్ నిర్వహణతో పాటు డీఎస్సి నోటిఫికేషన్ పై స్పష్టత ఇవ్వలని జనసేన పార్టీ తరపున డా వంపూరు గంగులయ్య డిమాండ్ చేసారు.