హంసవాహనంపై శ్రీవారు

తిరుమల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని కలిగించేందుకే శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించారని ప్రతీతి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.