స్కూల్ బిల్డింగ్ లేక గ్రామవార్డ్ ఇంటి వరండాలో చదువు కుంటున్న విద్యార్థులు: వంతల బుజ్జిబాబు

చింతపల్లి: అల్లూరి సీతారామ రాజు జిల్లా, పాడేరు, చింతపల్లి మండలం, తమ్మంగుల పంచాయతీ గల కొండపల్లి గున్నలు గ్రామంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ గిరిజన విద్యార్థులకు స్కూల్ బిల్డింగ్ లేకపోవడం చాలా ఆశ్చర్యం గల విషయం అని జనసేన పార్టీ చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జిబాబు అన్నారు. ఆయన మాట్లాడుతు ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా గిరిజన విద్యార్థుల చదువు విషయంలో ఎటువంటి ముందు చూపు చూడటం లేదు. ఓట్ల కోసం మాత్రం గిరిజన ప్రాంత గ్రామాలలో వస్తారని, ఏ రాజకీయ నాయకులు కూడా గిరిజన విద్యార్థుల సమస్యను మెరుగుపరచటం లేదు. అయితే కొండపల్లి గున్నలు గ్రామంలో ఇప్పటి వరకు స్కూల్ బిల్డింగ్ పూర్తి చెయ్యడం లేదు. 10 సంవత్సరాలు అయినప్పటికి గ్రామ వార్డ్ వారి గృహవరండాలో ఇప్పటి వరకు విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు. 10 సంవత్సరాలనుండి ఈ వరండాలో విద్యార్థులు చదువు నేర్చుకోవడం చాలా విచిత్రం. ఎందుకనగా ప్రభుత్వాలు ఉన్నపటికీ విద్యార్థుల యొక్క సమస్యను తెలుసుకోవటం లేదు ఎందుకు? ఉచిత చదువు అన్నారు కధ ఎందుకు ఇలాంటి గృహ వరండాలో చదువు చెప్తున్నారు అని వైసీపీ ప్రభుత్వంను డిమాండ్ చేశారు. నీచమైన రాజకీయ నాయకులు పోవాలి మంచి రాజకీయ నాయకులు రావాలి మన ఆంధ్ర రాష్ట్రానికి. గిరిజన ప్రజలు కోసం పోరాడే రాజకీయ నాయకులు మన రాష్ట్రనికి, మన నియోజకవర్గంనకు కావాలి.కొంతవరకు ఓపిక పట్టండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి 2024 సంవత్సరాల నాటికీ గిరిజన ప్రజా సమస్యలు తెలుసుకున్న మంచి రాజకీయ నాయకులు వస్తారు. అటువంటి మంచి నాయకులును మీ యొక్క నాణ్యమైన ఓటు వేసి గెల్పించండి. మీ యొక్క సమస్యలు తీరాలంటే మన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాకా మీ పిల్లల యొక్క భవిష్యత్తు రుణపడుతుంది. మా యొక్క జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కొండపల్లి గున్నలు గ్రామానికి స్కూల్ బిల్డింగ్ కట్టడాన్ని తప్పకుండ పూర్తిగా చేపడతామని కొండపల్లి గున్నలు గ్రామస్తులుకు తెలియజేసారు. ఈ సమావేశంలో కొండపల్లి గున్నలు ఎం.పీ.పీ.ఎస్ స్కూల్ టీచర్ బి. బంగారుతల్లి, స్కూల్ చైర్మన్ వంతల సాన్న, గ్రామ వార్డ్ వంతల రాజుకోటి, జనసైనికులు పాల్గొన్నారు.