ఐపీఎల్ 26వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఘనవిజయం

ఐపీఎల్ 26వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ను బోల్తా కొట్టించింది. 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఆ జట్టును రాహుల్‌ తెవాతియా (45; 28 బంతుల్లో 4×4, 2×6), రియాన్‌ పరాగ్‌(42; 26 బంతుల్లో 2×4, 2×6) ఆదుకున్నారు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి విజయాన్ని అందించారు. చివరికి ఒక బంతి మిగిలుండగానే ముందున్న టార్గెట్‌ ఛేదించారు. 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రాజస్తాన్ 163 పరుగులు చేసి హైదరాబాద్‌పై అనూహ్య విజయం సాధించింది.

మోస్తారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ తొలుత తడబడింది. హైదరాబాద్‌ బౌలర్లు రెచ్చిపోవడం వల్ల టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు బెన్‌ స్టోక్స్‌(5), బట్లర్‌(16)తో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(5), సంజూ శాంసన్‌(26), రాబిన్‌ ఉతప్ప(18) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఓటమి తప్పదనుకున్న సమయంలో తెవాతియా, పరాగ్‌ నిలకడగా ఆడారు. ఆ క్రమంలోనే చివర్లో రన్‌రేట్‌ పెరగడం వల్ల ధాటిగా ఆడి ఆ జట్టుకు మూడో విజయాన్ని నమోదు చేశారు. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ఖాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.