డ్రోన్లతో వ్యాక్సిన్‌ సరఫరా

తెలంగాణలో డ్రోన్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) శుక్రవారం అనుమతులిచ్చింది. ఏడాది పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్లు వినియోగించుకునేందుకు అనుమతులివ్వాల్సిందిగా పౌర విమానయాన శాఖ, డిజిసిఎలను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించిన డిజిసిఎ డ్రోన్ల వినియోగానికి అంగీకరించింది. వ్యాక్సిన్‌ పంపిణీలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గైడ్‌లైన్స్‌ విడుదల చేయనుంది.