‘శశి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘జెంటిల్ మెన్’ భామ

తెలుగులో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఆతర్వాత నాని నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాలో నటించి అలరించిన అందాల భామ సురభి.. నటించింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. ఈ రెండు సినిమాల ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకున్న సురభికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ‘ఒక్క క్షణం’ .. ‘ఓటర్’ సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం సురభి చేతిలో రెండు టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అది సాయికుమార్ నటిస్తున్న శశి ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విదులైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మరో సినిమాను కూడా సురభి ఓకే చేసిందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో సురభి రాణించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండు సినిమాలు ఆమె కెరియర్ కు ఎంతవరకు సహాయపడతాయో వేచి చూడాల్సిందే.