ప్రజలు పచ్చగా ఉండడం స్వామికి ఇష్టం లేదు.. అందుకే రోడ్డు వెడల్పు చేయలేదు

  • కుటుంబం మీద ఉన్న మక్కువ ప్రజల మీద లేదు
  • యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వెడల్పు చేయాలి
  • జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, పచ్చికాపలంలో జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో రెండవ రోజు పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. దారి పొడవునా ప్రయాణికులు, ప్రజలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అసమర్థత వల్లే కార్వేటినగరం నుండి కొత్తపల్లి మెట్ట వరకు రోడ్డు వెడల్పు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వెదురుకుప్పం మండలాన్ని, కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపకుండా నీ స్వార్థం కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టావని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రమాదాల బారిన పడకుండా ప్రజలకి, అభివృద్ధి పథంలో రెండు మండలాలు ఉండే విధంగా తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరాన్ని తిరుపతిలో కలపలేవా? అదే పరిధిలో ఉన్న వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేవా? అని మండిపడ్డారు. అయితే జనసేన పార్టీ ఏకైక లక్ష్యం ప్రయాణికులకు అండగా ఉండటం, నియోజకవర్గ ప్రజలకి అండగా ఉండటం. ఈ రోడ్డుని వెడల్పు చేసేంతవరకు వీరోచితమైన పోరాటం చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం 44 డిగ్రీల మండుటెండల్లో పాదయాత్ర చేస్తూ ఉండటం సూర్య భగవానుడు మాతో కూడా ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. మా నినాదం, మా ఆశయం, మా లక్ష్యం, మా సంకల్పం ప్రజా క్షేమమే అని తెలియజేశారు. కాలేజీ కట్టకుండా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింప చేయటం జాతీయ నాయకులను అవమానించడమే అని ఎద్దేవా చేశారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు సౌకర్యవంతమైన భవనాలు నిర్మించకుండా ఇదేందని వ్యంగ్యంగా మాట్లాడారు. కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరింపజేసి విద్యార్థులలో మానసిక మేధోసంపత్తిని తీసుకొచ్చే విధంగా ఉండాలి కానీ కళాశాలకు ముందే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్నిమేము తప్పు పట్టడం లేదు, కాలేజీ కట్టకుండా ఈ విధంగా చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా కమిటీ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.