జనసైనికుని కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన సయ్యద్ కాంతి శ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, అదపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైన జనసైనికుడు దుక్కా కోదండరావు కుటుంబసభ్యులను ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు సయ్యద్ కాంతి శ్రీ పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సహాయంను అందించారు.. అనంతరం అదపాక గ్రామంలో సూర్యనారాయణ నివాసం వద్ద జనసైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం జనసైనికులు గొర్లె సూర్యనారాయణ, బార్నాల దుర్గారావు, నాని, కాకర్లబాబాజీ, అదపాక గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.