తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం, కొండ్రుప్రోలు గ్రామం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరుస్తూ మరియు సీనియర్ రాజకీయనాయకులు తోటగోపి పైబోయినవెంకట్రామయ్య మరియు పైబోయినరఘుల ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.