లండన్ మేయర్ అభ్యర్ధి తరుణ్ గులాటిని మర్యాదపూర్వకంగా కలిసిన యూకే జనసేన

లండన్, 2024 లండన్ మేయర్ అభ్యర్ధి తరుణ్ గులాటిని యూకే జనసేన తరపున నాగరాజు వడ్రాణం, శంకర్ సిద్ధం, చంద్ర సిద్ధం, అఖిల్ పెండ్యాల మరియు కిరణ్ ఉండి, జగదీష్ మేడిశెట్టి, శ్రీనివాస్ అప్పన, శ్యామ్ పులి మరియు వెంకటేష్ కృష్ణమూర్తి శనివారం తరుణ్ గులాటి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వారి మద్దతును తెలియజేసి వారి విజయానికి కృషిచేస్తామని తెలియజేయడం జరిగింది. తరుణ్ గులాటి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు కోరిన సంగతి విధితమే.