క్రియాశీలక సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకొండి.. ఆకేపాటి

  • క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి, మీ కుటుంబానికి భరోసాని కల్పించండి అనే నినాదంతో మహిళలకు అవగాహన కల్పించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడతగా ఫిబ్రవరి 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు జరగనున్నది, కావున జనశ్రేణులు, జనసేన పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకొని మీ కుటుంబానికి భరోసాని కల్పించండి, ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగినచో 50 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా క్రియాశీలక సభ్యునికి జరగరానిది జరిగినచో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకు అందుబాటులోకి తీసుకువచ్చారని, కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక మహిళలకు అవగాహన కల్పించి వారిని జనసేన పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.