తలైవి జయంతి: అమ్మకు తమిళ ప్రజల నీరాజనం…

తమిళనాట అందరూ అమ్మగా పిలిచే జయలలిత జయంతి నేడు. ఫిబ్రవరి 24, 1948 లో మైసూరు రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన జయలలిత చదువులో రాణిస్తున్న సమయంలో ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. 1961 నుంచి 1980 మధ్యకాలంలో అనేక సినిమాల్లో నటిస్తూ మెప్పించారు. ఎంజీఆర్ తో అత్యధిక సినిమాలు చేసిన జయలలిత, ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడిఎంకే పార్టీలో చేరారు. 1984 నుంచి 1989 వరకు జయలలిత తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రతినిధ్యం వహించారు. 1991 లో జయలలిత తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 వరకు, ఆ తరువాత 2010 నుంచి 2015, 2015 నుంచి 2016 డిసెంబర్ 5 తేదీన మరణించే వరకు ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. తమిళనాడులో ప్రజలు జయలలితను అమ్మ, పురట్చి తలైవి అని పిలుస్తారు. ఈరోజు జయలలిత జయంతి కావడంతో అక్కడి ప్రజలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.