తమిళనాడు ఎన్నికలు: డీఎంకే…కాంగ్రెస్ మధ్య పొత్తు..

ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగానే పొత్తుల పర్వం నడుస్తున్నది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. కాగా, శనివారం అర్ధరాత్రి సమయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తులు కుదిరాయి. సీట్లు సర్దుబాటుకూడా పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి డీఎంకే 24 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ కు 20 స్థానాల్లో పోటీ చేసేందుకు మాత్రమే అవకాశం ఇవ్వాలని డీఎంకే భావించినా, కాంగ్రెస్ పట్టుబట్టడంతో 24 స్థానాల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2011 లో 63 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 2016 లో 41 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇప్పుడు 24 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నాయి.