థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీపై వెనక్కి తగ్గిన తమిళనాడు

తమిళనాడులోని సినిమా థియేటర్లలో 100శాతం సీట్ల సామర్థ్యంతో టిక్కెట్లు విక్రయించుకోవచ్చంటూ గత వారం తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కొవిడ్‌ నిబంధనలను నీరుగార్చవద్దని ఆదేశిస్తూ లేఖ రాశారు. 50శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను తెరుచుకొనేందుకే అవకాశం ఉందని, ఇది విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.